icon icon icon
icon icon icon

ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన రేవంత్‌ ప్రభుత్వం

వంద రోజుల్లోనే రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు.

Published : 22 Apr 2024 04:13 IST

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ

మహబూబ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: వంద రోజుల్లోనే రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ విమర్శించారు. భాజపా మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా ప్రచారం చేసేందుకు ఆదివారం మహబూబ్‌నగర్‌కు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్ల భారాస పాలనలో మాదిగలు అణచివేతకు గురయ్యారని, ఏనాడు మాదిగల సామాజిక స్థితిగతులపై కేసీఆర్‌ దృష్టి సారించలేదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా మాదిగలకు పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మాదిగలకు కాంగ్రెస్‌ ఒక్క సీటు కూడా ఇవ్వలేదని, భాజపా మాత్రం రెండు ఎంపీ స్థానాలు కేటాయించిందని తెలిపారు. భాజపా ఒక్కటే మాదిగలు 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్న వర్గీకరణ చేయగలదని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని మాదిగలంతా భాజపా వెంట నడుస్తారని చెప్పారు. డీకే అరుణ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు భాజపా కట్టుబడి ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img