icon icon icon
icon icon icon

అక్కడ నాలుగు గంటల వరకే పోలింగ్‌

రాష్ట్రంలోని అయిదు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 13 శాసనసభ సెగ్మెంట్లలో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్‌ ముగించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

Updated : 23 Apr 2024 06:36 IST

రాష్ట్రంలోని అయిదు లోక్‌సభ స్థానాల పరిధిలోని 13 శాసనసభ నియోజవర్గాల్లో..
తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో భారీ బందోబస్తు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అయిదు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 13 శాసనసభ సెగ్మెంట్లలో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్‌ ముగించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మే 13వ తేదీన రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో తీవ్రవాదుల ప్రభావం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఆయా ప్రాంతాల్లో పోలీసు బందోబస్తును కట్టుదిట్టం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి స్పష్టం చేసింది. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎదురుకాల్పుల నేపథ్యంలో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో విస్తృత స్థాయిలో కూంబింగ్‌ నిర్వహించాలని కేంద్ర బలగాలు నిర్ణయించాయి. ఇప్పటి నుంచే తనిఖీలను ముమ్మరం చేశాయి. సాధారణంగా అన్ని నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగుస్తుందని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ సోమవారం ‘ఈనాడు’తో చెప్పారు. ఆయా నియోజకవర్గాలకు అదనపు బలగాలను కూడా కేటాయించినట్లు వివరించారు.

ఎక్కడెక్కడంటే..

మహబూబాబాద్‌, పెద్దపల్లి, ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ స్థానాల్లో గంట ముందుగా పోలింగ్‌ ముగియనుంది. వాటిలో సిర్పూర్‌, ఆసిఫాబాద్‌(ఆదిలాబాద్‌ లోక్‌సభ), చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని(పెద్దపల్లి), భూపాలపల్లి(వరంగల్‌), ములుగు, పినపాక, ఇల్లెందు, భద్రాచలం(మహబూబాబాద్‌), కొత్తగూడెం, అశ్వారావుపేట(ఖమ్మం) శాసనసభ నియోజకవర్గాలున్నాయి.


‘ఇంటి నుంచి ఓటు’

దరఖాస్తు గడువు నేటితో పూర్తి

ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగానికి వీలుగా దరఖాస్తు చేసుకునే గడువు మంగళవారంతో ముగియనుంది. 85 సంవత్సరాలు నిండిన వయోవృద్ధులు, 40 శాతానికి పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులు ఇంటి నుంచి ఓటు వేసేలా కేంద్ర ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులతో వచ్చే నెల 3 నుంచి 8వ తేదీలోగా ఇంటి నుంచి ఓటు వినియోగించుకునే ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img