icon icon icon
icon icon icon

ఓటమి భయంతోనే మోదీ రెచ్చగొట్టే ప్రసంగాలు

లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రధాని మోదీ మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సోమవారం విమర్శించారు.

Published : 23 Apr 2024 03:27 IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రధాని మోదీ మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సోమవారం విమర్శించారు. ప్రతిపక్షాలు గెలిస్తే హిందువుల ఆస్తులను ముస్లింలకు, చొరబాటుదారులకు పంచుతారని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని వ్యాఖ్యలు రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పక్కదారి పట్టించేందుకు మతం పేరుతో మభ్యపెట్టడం మోదీకి, భాజపాకు అలవాటుగా మారిపోయిందన్నారు. ఒక వర్గానికి వ్యతిరేకంగా ప్రధాని ప్రజలను రెచ్చగొట్టడం స్పష్టంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకమని, తక్షణమే ఎన్నికల సంఘం ఆయనపై చర్యలు తీసుకోవాలని కూనంనేని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img