icon icon icon
icon icon icon

నెహ్రూ, గాంధీ కుటుంబ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి: జగ్గారెడ్డి

నెహ్రూ, గాంధీ కుటుంబ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి కోరారు.

Published : 23 Apr 2024 03:27 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: నెహ్రూ, గాంధీ కుటుంబ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి కోరారు. ఈ విషయంపై తొందర్లోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి వివరిస్తానన్నారు. ఆయన సోమవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రామాయణం, మహాభారతం చరిత్ర ఎలా ఉందో..స్వతంత్య్రం తర్వాత గాంధీ కుటుంబానిది అలాంటి చరిత్రేనన్నారు. ఎన్నికల వ్యవస్థ తెచ్చిందే నెహ్రూ..దీన్ని భాజపా నేతలు కాదంటారా? అని ప్రశ్నించారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే దేశంలో శ్రీరాముని పాలనకు పునాది పడిందన్నారు. కాంగ్రెస్‌ ఏం చేసిందని మాట్లాడుతున్న కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులకు ఇవేవీ కనిపించవు..వారికి తెలిసిందల్లా కాంగ్రెస్‌పై తప్పుడు ప్రచారం చేయడమేనని జగ్గారెడ్డి ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img