icon icon icon
icon icon icon

మైనారిటీల ఓట్ల కోసం కాంగ్రెస్‌ తప్పుడు ప్రచారం

కాంగ్రెస్‌ నేతలు ఓట్ల కోసం మైనార్టీలను అబద్ధాలతో రెచ్చగొడుతున్నారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. భాజపాపై కాంగ్రెస్‌ నాయకులు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని అన్నారు.

Updated : 23 Apr 2024 06:39 IST

భాజపా నేత లక్ష్మణ్‌ విమర్శ

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేతలు ఓట్ల కోసం మైనార్టీలను అబద్ధాలతో రెచ్చగొడుతున్నారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఆరోపించారు. భాజపాపై కాంగ్రెస్‌ నాయకులు గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని అన్నారు. సోమవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఏఏపై కూడా ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్‌ చూస్తోందన్నారు. సీఏఏ ముస్లింలకు వ్యతిరేకం కాదని.. దీనివల్ల ఎవరికీ నష్టం లేదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు వందసార్లు రాజ్యాంగాన్ని సవరించిందని, ఇందిరాగాంధీ హయాంలో రాజ్యాంగ స్వేచ్ఛను హరించారని అన్నారు. ఇండియా కూటమి పార్టీలు రాహుల్‌గాంధీ తమ ప్రధాని అభ్యర్థి అని చెప్పలేకపోతున్నాయని ఎద్దేవా చేశారు.


హామీలు అమలు చేయకుంటే సీఎం రాజీనామా చేస్తారా?

-మహేశ్వర్‌రెడ్డి

గస్టులోపు హామీలు అమలు చేయకుంటే సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేస్తారా? అని భాజపా శాసనసభాపక్షనేత ఎ.మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం హామీలను ప్రజలు నమ్మడం లేదని, అందుకే ఆయన దేవుళ్ల మీద ఒట్లు వేస్తున్నారని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలపై సీఎంకు లేఖ రాసినట్లు తెలిపారు. కల్యాణలక్ష్మి సాయంతో పాటు తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీల హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌వీఎస్‌ఎస్‌. ప్రభాకర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. ఎమ్మెల్యేల సీట్లలో, మంత్రి పదవుల్లో బీసీలకు అన్యాయం జరిగిందని.. కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కళ్లు తెరవాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img