icon icon icon
icon icon icon

‘ఐపీఎల్‌’ మ్యాచ్‌లో కాంగ్రెస్‌కు కెప్టెనే లేడు

దేశంలో జరుగుతున్న ఐపీఎల్‌ (ఇండియన్‌ పొలిటికల్‌ లీగ్‌)కు భాజపా కెప్టెన్‌గా ప్రధాని నరేంద్రమోదీ ఉన్నారని, కెప్టెన్‌ లేకుండానే కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఆడుతోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు.

Published : 23 Apr 2024 03:29 IST

బండి సంజయ్‌ ఎద్దేవా

హుస్నాబాద్‌, న్యూస్‌టుడే: దేశంలో జరుగుతున్న ఐపీఎల్‌ (ఇండియన్‌ పొలిటికల్‌ లీగ్‌)కు భాజపా కెప్టెన్‌గా ప్రధాని నరేంద్రమోదీ ఉన్నారని, కెప్టెన్‌ లేకుండానే కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఆడుతోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సోమవారం జరిగిన నియోజకవర్గస్థాయి భాజపా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో భాజపా 400 సీట్లకుపైగా గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఈ ఎన్నికల్లో తనను ఓడించేందుకు మాజీ సీఎం కేసీఆర్‌ సర్వశక్తులూ ఒడ్డుతున్నారని, అందుకోసం ఐదు రోజులు కరీంనగర్‌లోనే ఉంటానని అంటున్నారని ఆరోపించారు. కరీంనగర్‌కు ఎన్ని నిధులు ఇచ్చారో కేసీఆర్‌ను నిలదీయాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలుచేస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌ నేతలను ఆ విషయమై ప్రశ్నించాలని సూచించారు. హామీలు అమలుచేసే వరకూ పోరాడతామన్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ శాసనసభ్యుడు సూర్యనారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img