icon icon icon
icon icon icon

కొండా సురేఖపై చర్య తీసుకునేలా ఆదేశించండి

భారాస ఎమ్మెల్యే కేటీఆర్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలంటూ భారాస అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్‌ సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Updated : 23 Apr 2024 06:33 IST

హైకోర్టులో దాసోజు శ్రవణ్‌కుమార్‌ పిటిషన్‌

ఈనాడు, హైదరాబాద్‌: భారాస ఎమ్మెల్యే కేటీఆర్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకునేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలంటూ భారాస అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్‌ సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వరంగల్‌లో మార్చి 16న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఫోన్‌ట్యాపింగ్‌లో కేటీఆర్‌ పాత్ర ఉందంటూ ఆరోపణలు చేశారన్నారు. జైలుకు పంపిస్తామని వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థ కేటీఆర్‌ను కనీసం అనుమానితుడిగా కూడా ప్రకటించలేదని, ఎలాంటి ఆధారాలు లేకుండా కొండా సురేఖ ఇలాంటి ప్రకటనలు చేశారన్నారు. నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఓట్లు పొందాలని చూడడం ద్వారా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘించారని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఈనెల 8న ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తమ ఫిర్యాదును జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు పంపుతూ ప్రొసీడింగ్స్‌ను జారీ చేసిందని పేర్కొన్నారు. ఆ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలని, నిబంధనల ప్రకారం ఆమెపై చర్య తీసుకోవాలని కోరారు. ప్రతివాదులుగా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి, వరంగల్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, కొండా సురేఖలను చేర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img