icon icon icon
icon icon icon

భాజపా, భారాసలకు డిపాజిట్లు గల్లంతే: ఉత్తమ్‌

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, భారాస అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

Published : 23 Apr 2024 03:32 IST

హాలియా, న్యూస్‌టుడే: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, భారాస అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా హాలియాలో ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన నాగార్జునసాగర్‌ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డితో కలసి ఉత్తమ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రావి నారాయణరెడ్డి పేరిట ఉన్న మెజార్టీ రికార్డును తిరగరాయాలన్నారు. మోదీ ప్రభుత్వం మద్దతుధర పేరుతో రైతులను, ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసిందన్నారు. ఈ ఎన్నికల అనంతరం అర్హులందరికీ కొత్త రేషన్‌కార్డులు ఇస్తామని చెప్పారు. నెల్లికల్‌ లిఫ్టుకు రూ.200 కోట్లు మంజూరు చేసి మొదటి దశ ఏడువేల ఎకరాలకు నీరు, ఎడమకాలువపై లిఫ్టులకు మరమ్మతులు చేయించి 35 వేల ఎకరాలకు సాగునీరు అందేలా కృషి చేస్తానని ఉత్తమ్‌ హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం భారాస కనుమరుగవుతుందన్నారు. రఘువీర్‌రెడ్డి గెలిచిన అనంతరం నాగార్జునసాగర్‌ జలాశయంలో తాను కేటాయించిన ఎయిర్‌ డ్రోమ్‌ పూర్తి చేసి, సాగర్‌ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సూచించారు. జానారెడ్డి మాట్లాడుతూ.. శ్రీశైలం టన్నెల్‌ పూర్తి చేసి ఎడమ కాలువకు నీరివ్వాలని ఉత్తమ్‌ను కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, బాలునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img