icon icon icon
icon icon icon

సిద్దిపేటలో 25న అమిత్‌షా బహిరంగ సభ

భాజపా ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ నెల 25న సిద్దిపేట రానున్నారు.

Published : 23 Apr 2024 03:33 IST

సిద్దిపేట అర్బన్‌, న్యూస్‌టుడే: భాజపా ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ నెల 25న సిద్దిపేట రానున్నారు. తొలుత ఆయన ప్రచారసభను జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని బాన్సువాడలో ఏర్పాటు చేయాలనుకున్నా.. ఇప్పుడు మార్పు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా హాజరవుతారని భాజపా మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు సోమవారం తెలిపారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్‌ నియోజకవర్గాల నుంచి ప్రజలు ఈ బహిరంగసభకు వస్తారని చెప్పారు. తనను గెలిపిస్తే రూ. 100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేసి ప్రజాసేవ చేస్తానన్న మెదక్‌ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి.. ఎమ్మెల్సీ పదవి ద్వారా ఎక్కడ, ఎన్ని నిధులు ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బహిరంగ సభ నిర్వహించబోయే మైదానాన్ని స్థానిక నాయకులతో కలిసి రఘునందన్‌రావు పరిశీలించారు. కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img