icon icon icon
icon icon icon

భాజపాతోనే ఆదివాసీ, గిరిజనుల సంక్షేమం

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేస్తోందని కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమలు, భూశాస్త్ర శాఖల మంత్రి కిరణ్‌ రిజిజు విమర్శించారు.

Published : 23 Apr 2024 03:33 IST

మహబూబాబాద్‌, నల్గొండల్లో కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు

ఈనాడు, మహబూబాబాద్‌, నల్గొండ: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసం చేస్తోందని కేంద్ర ఆహారశుద్ధి పరిశ్రమలు, భూశాస్త్ర శాఖల మంత్రి కిరణ్‌ రిజిజు విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనలో ఎలాంటి ప్రాధాన్యానికి నోచుకోని ఆదివాసీ, గిరిజనుల సంక్షేమం.. అభివృద్ధికి భాజపా పాటుపడిందన్నారు. సోమవారం మహబూబాబాద్‌ పార్లమెంటు అభ్యర్థి ప్రొఫెసర్‌ అజ్మీరా సీతారాంనాయక్‌, నల్గొండ పార్లమెంటు అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి నామినేషన్ల ర్యాలీల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘ఆయా రాష్ట్రాల్లో ఇటీవల ముగిసిన తొలిదశ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఒక్క సీటూ గెలవదు. భాజపా ప్రభుత్వం గిరిజన మహిళకు రాష్ట్రపతి పదవి ఇవ్వడంతోపాటు ఎస్టీ వర్గానికి చెందిన నన్ను కేంద్ర మంత్రిని చేసింది. దేశానికి ప్రధానిగా మోదీ అవసరం ఉంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల్పనకు సిద్ధంగా ఉన్నాం. నల్గొండలో భాజపాను గెలిపిస్తే ఈ ప్రాంతంలో ఆహారశుద్ధి పరిశ్రమలు నెలకొల్పుతాం. అత్యధికంగా గిరిజనులు, ఆదివాసీలున్న మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్న సీతారాంనాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించి మోదీకి బహుమతిగా ఇవ్వాలి. తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా భాజపా పూర్తి బలంతో పోటీ చేస్తోంది’ అని పేర్కొన్నారు. ఆయా ర్యాలీల్లో రాజ్యసభ మాజీ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img