icon icon icon
icon icon icon

రేవంత్‌రెడ్డివి గారడీ మాటలు

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మళ్లీ గారడీ మాటలు చెబుతున్నారని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు.

Published : 24 Apr 2024 03:28 IST

మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి విమర్శ

ఈనాడు, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మళ్లీ గారడీ మాటలు చెబుతున్నారని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. సిసలైన రైతు పక్షపాత పార్టీ అయిన భారాసకు ఓటేయాలని మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ‘‘రైతాంగాన్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని రేవంత్‌ అంటున్నారు. బకాయిలు రావాలని ఎర్రజొన్న రైతులు ఆందోళన చేస్తే.. కాల్పులు జరిపి, కేసులు పెట్టింది ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం కాదా..? కేసీఆర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.11 కోట్ల బకాయిలను రైతులకు చెల్లించి, వారిపై ఉన్న కేసులు ఎత్తివేసింది. భాజపా కూడా.. ఎన్నికల లబ్ధి కోసం పసుపు బోర్డు ఇచ్చామని ప్రధానమంత్రితో అబద్ధపు ప్రకటన చేయించింది’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img