icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాపై అదే ఉత్కంఠ

రాష్ట్రంలో కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థుల తుది జాబితాను బుధవారం విడుదల చేసే అవకాశాలున్నాయి. ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్‌ నియోజకవర్గాలకు అభ్యర్థులను పార్టీ ఇంకా ప్రకటించలేదు.

Published : 24 Apr 2024 03:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థుల తుది జాబితాను బుధవారం విడుదల చేసే అవకాశాలున్నాయి. ఖమ్మం, కరీంనగర్‌, హైదరాబాద్‌ నియోజకవర్గాలకు అభ్యర్థులను పార్టీ ఇంకా ప్రకటించలేదు. మంగళవారం జాబితాను విడుదల చేస్తారని అంచనా వేసినా బుధవారానికి వాయిదా వేసినట్లు తెలిసింది. ఖమ్మం అభ్యర్థిపై నిర్ణయానికి రాలేకపోవడం వల్లే జాబితా విడుదలలో ఆలస్యం జరుగుతున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గానికి రఘురామిరెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు రెండురోజులుగా పార్టీలో ప్రచారం జరుగుతోంది. కానీ మరో అభ్యర్థిని పరిశీలించాలని ఒత్తిళ్లు రావడం వల్లే అధికారికంగా ప్రకటించకుండా ఆగినట్లు తెలుస్తోంది. కరీంనగర్‌కు వెలిచాల రాజేందర్‌రావు పేరు దాదాపు ఖరారైనట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. హైదరాబాద్‌కు మహ్మద్‌ వలీ ఉల్లా సమీర్‌ పేరునే పార్టీ పరిశీలిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img