icon icon icon
icon icon icon

మేడిగడ్డలాగే కూలింది!

మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిన ఘటనపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రానికి వచ్చిన ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు.

Published : 24 Apr 2024 03:29 IST

మంత్రి శ్రీధర్‌బాబు

మహాముత్తారం, న్యూస్‌టుడే: మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిన ఘటనపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రానికి వచ్చిన ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ‘‘భారాస హయాంలో అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను గాలికి వదిలేసి కేవలం గుత్తేదారులకు మేలు చేసేందుకు.. కమీషన్లతో నాయకులు తమ జేబులు నింపుకోవడానికే అధికారాన్ని వాడుకున్నారని మరోసారి రుజువైంది. మేడిగడ్డ మాదిరే ఇది కూడా కూలింది. వంతెన దాదాపు ఎనిమిదేళ్లుగా నిర్మాణంలోనే ఉన్నా గుత్తేదారుపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లా. వంతెనను నాణ్యత లేకుండా నిర్మించడానికి కారణమైన వారందరి పాత్రపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని... ముందు జాగ్రత్తగా ఖమ్మంపల్లి వద్ద నిర్మించిన మరో వంతెన నాణ్యతను పరిశీలించాలని ఆదేశించా’’ అని తెలిపారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి, పెద్దపల్లి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img