icon icon icon
icon icon icon

ఈసారి పక్కాగా పోస్టల్‌ బ్యాలెట్లు

గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్ ఓట్ల విషయంలో గందరగోళం ఏర్పడింది. బ్యాలెట్ దరఖాస్తు పత్రాలన్నీ మ్యానువల్‌గా సేకరించి ఆయా జిల్లాలకు పంపిణీ చేసే క్రమంలో దొర్లిన పొరపాట్లతో ఎన్నికల విధుల్లో పాల్గొన్న అనేక మంది ఉద్యోగులు అయోమయానికి గురయ్యారు.

Updated : 24 Apr 2024 03:33 IST

ఈనాడు, వరంగల్‌: గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్ ఓట్ల విషయంలో గందరగోళం ఏర్పడింది. బ్యాలెట్ దరఖాస్తు పత్రాలన్నీ మ్యానువల్‌గా సేకరించి ఆయా జిల్లాలకు పంపిణీ చేసే క్రమంలో దొర్లిన పొరపాట్లతో ఎన్నికల విధుల్లో పాల్గొన్న అనేక మంది ఉద్యోగులు అయోమయానికి గురయ్యారు. 5 నుంచి 10 శాతం మంది ఓటుకు దూరమయ్యారని అంచనా. పైగా విధులు నిర్వర్తించే చోటే పోస్టల్‌ బ్యాలెట్ ఓటు వేయాలనే నిబంధన పలు ఇబ్బందులకు కారణమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం సాంకేతికతను వినియోగించి ఈసారి పోస్టల్‌ బ్యాలెట్ ఓటింగ్‌లో గజిబిజి లేకుండా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చింది. www.nic.in వెబ్‌సైట్లో ప్రత్యేకంగా పోస్టల్‌ బ్యాలెట్ కోసం ఒక అప్లికేషన్‌ను ఉంచింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది నుంచి ‘ఫాం 12’ పత్రాలను సేకరించి వారి పేరు, ‘ఎపిక్‌’ కార్డు సహా పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నారు. మరోవైపు తాము ఓటు హక్కు కలిగిన చోట లేదా పని చేసే ప్రదేశం లేదా ఇతర చోట ఓటు వేసే అవకాశం కల్పించారు. సదరు ఉద్యోగి ఎక్కడ ఓటు వేయడానికి ఎంపిక చేసుకున్నారో ఆ డేటా అంతా ఆన్‌లైన్‌లోనే కనిపించేలా  ఏర్పాట్లు చేశారు. మే 4 నుంచి 8 వరకు పోస్టల్‌ బ్యాలెట్ ఓటింగ్‌ ప్రక్రియ పూర్తవుతుంది. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పోస్టల్‌ బ్యాలెట్ ఓటు వేసే వారికి ఒకరోజు సాధారణ సెలవును కూడా ప్రభుత్వం ఇస్తోంది. దీని వల్ల 90 శాతం మంది ఉద్యోగులు తమకు ఓటు హక్కు ఉన్న ప్రాంతాలనే ఎంపిక చేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. పోస్టల్‌ బ్యాలెట్ ఫాంలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు ఈసారి అన్ని జిల్లాల ఎన్నికల కార్యాలయాల్లో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img