icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌లోకి మెదక్‌ డీసీసీబీ ఛైర్మన్‌ దేవేందర్‌రెడ్డి

సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రానికి చెందిన ఉమ్మడి మెదక్‌ డీసీసీబీ ఛైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి భారాసను వీడారు.

Published : 24 Apr 2024 04:48 IST

కొండపాక గ్రామీణం, న్యూస్‌టుడే: సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రానికి చెందిన ఉమ్మడి మెదక్‌ డీసీసీబీ ఛైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి భారాసను వీడారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్నారు. ఆయన భార్య, కొండపాక మండలం సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షురాలు చిట్టి మాధురితోపాటు సిద్దిపేట జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు ఆరేపల్లి మహదేవ్‌, ఎనిమిది మంది డీసీసీబీ డైరెక్టర్లు, ఒక పీఏసీ డైరెక్టర్‌, ఐదుగురు మాజీ సర్పంచులు, ఇద్దరు మాజీ ఉపసర్పంచులు, కొండపాక, కుకునూరుపల్లి మండలాలకు చెందిన పలువురు భారాస నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img