icon icon icon
icon icon icon

ఆస్తులు.. అప్పులు..

లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగేందుకు రాష్ట్రంలోని పలుచోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు వేశారు.

Updated : 24 Apr 2024 05:15 IST

లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగేందుకు రాష్ట్రంలోని పలుచోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లలో తమ ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలు పేర్కొన్నారు. ఆయా అఫిడవిట్ల ప్రకారం వివరాలివి.


రూ.435 కోట్ల ఆస్తులు.. సొంతంగా కారు లేదు

అభ్యర్థి: గడ్డం రంజిత్‌రెడ్డి
నియోజకవర్గం: చేవెళ్ల
పార్టీ: కాంగ్రెస్‌

కుటుంబ ఆస్తుల విలువ రూ.435.49 కోట్లు. స్థిర, చరాస్తుల్లో అధికశాతం పెట్టుబడులు, షేర్లలో ఉన్నాయి. ఆయన బ్యాంకు ఖాతాలో రూ.1.39 లక్షల నగదు ఉంది. ఆయన సతీమణి సీతారెడ్డి వద్ద రూ.1.59 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలున్నాయి. వీరికి సొంతంగా ఒక్క కారు కూడా లేదు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, వరంగల్‌లోని సుబేదారిలో ఇళ్లున్నాయి. ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి, మేడ్చల్‌ జిల్లా పూడూరు గ్రామాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర భూములున్నాయి. రూ.141.01 కోట్ల స్థిరాస్తులు, రూ.294.48 కోట్ల చరాస్తులు ఉన్నాయి. వివిధ బ్యాంకుల్లో రూ.23.01 కోట్ల అప్పులున్నాయి. విద్యార్హత వెటర్నరీ సైన్స్‌లో ఎమ్మెస్సీ.


రూ.1.77 కోట్ల చరాస్తులు.. 47 క్రిమినల్‌ కేసులు

అభ్యర్థి: ఆత్రం సక్కు
నియోజకవర్గం: ఆదిలాబాద్‌
పార్టీ: భారాస

స్థిరాస్తిగా సొంతూరు తిర్యాని మండలం లక్ష్మిపూర్‌లో ఉన్న రూ.3 లక్షల విలువైన ఇల్లు మాత్రమే ఉంది. సక్కు సతీమణి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఆయన సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే పింఛను, సతీమణి వేతనం ఆదాయ వనరులు. ఆయన పేరిట రూ.1.77 కోట్లు, సతీమణి పేరిట రూ.7.49 లక్షల విలువైన చరాస్తులున్నాయి. మూడు వాహనాలు, ఆయన వద్ద 10 గ్రాముల బంగారు గొలుసు, సతీమణి వద్ద 55 గ్రాముల నగలు ఉన్నాయి. ఆయన పదో తరగతి పూర్తిచేశారు. ఆయనపై 47 క్రిమినల్‌ కేసులున్నాయి.


35 ఎకరాల సాగుభూమి.. 500 గ్రాముల బంగారం

అభ్యర్థి: కంచర్ల కృష్ణారెడ్డి
నియోజకవర్గం: నల్గొండ
పార్టీ: భారాస

ఆయన కుటుంబానికి రూ.83.66 కోట్ల ఆస్తులున్నాయి. రూ.1.62 కోట్ల చరాస్తులు,  రూ.82 కోట్లకు పైగా స్థిరాస్తులు.. ఫార్చునర్‌, స్కోడా కార్లు ఉన్నాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల, నేరడ, చిట్యాల ప్రాంతాల్లో 35 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. సతీమణి పేరిట 500 గ్రాములు, ఆయన పేరు మీద 5 గ్రాముల బంగారు వస్తువులున్నాయి. నల్గొండలోని ఓ బ్యాంకులో రూ.95 లక్షల అప్పు ఉంది.


హైదరాబాద్‌లో ఇళ్లు, స్థలాలు..

అభ్యర్థి: రాగిడి లక్ష్మారెడ్డి
నియోజకవర్గం: మల్కాజిగిరి
పార్టీ: భారాస

కుటుంబ ఆస్తుల విలువ రూ.82.55 కోట్లు. స్థిరాస్తుల్లో అధిక శాతం ఇళ్లు, వ్యవసాయేతర భూములు ఉన్నాయి. ఆయన బ్యాంకు ఖాతాలో రూ.3.65 లక్షల నగదు ఉండగా, ఆయన సతీమణి వద్ద రూ.2.52 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలున్నాయి. ఇద్దరికీ కలిపి బీఎండబ్ల్యూ సహా నాలుగు కార్లున్నాయి. హైదరాబాద్‌లోని మాదాపూర్‌, బంజారాహిల్స్‌, మన్సూరాబాద్‌లలో ఇళ్లు, ఇళ్ల స్థలాలుండగా, భువనగిరి జిల్లాలో 44 ఎకరాల వ్యవసాయ భూములున్నాయి. స్థిరాస్తుల విలువ రూ.62.12 కోట్లు, చరాస్తుల విలువ రూ.20.43 కోట్లు. వివిధ బ్యాంకుల్లో రూ.8.78 కోట్ల అప్పులున్నాయి. ఆయన ఇంటర్‌ వరకు చదివారు.


115 తులాల బంగారం.. మాదాపూర్‌లో నివాస భవనం

అభ్యర్థి: మాలోత్‌ కవిత
నియోజకవర్గం: మహబూబాబాద్‌
పార్టీ: భారాస

మాలోత్‌ కవిత కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ రూ.4.97 కోట్లు. వారివద్ద 115 తులాల బంగారు ఆభరణాలు.. టాటా సఫారీ, ఇన్నోవా కార్లు ఉన్నాయి. హైదరాబాద్‌లోని మాదాపూర్‌ విష్ణుమార్గ్‌లో 2,200 చదరపు అడుగుల నివాస భవనం ఉంది. కవిత భర్త భద్రునాయక్‌ పేరిట 10.05 లక్షల అప్పు ఉంది. గూడూరు, దుమ్ముగూడెం ఠాణాల్లో రెండు కేసులున్నాయి.


ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, నల్గొండ అర్బన్‌,
పాలనాప్రాంగణం (ఆదిలాబాద్‌), మహబూబాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img