icon icon icon
icon icon icon

ఐదో రోజు 128 మంది నామినేషన్లు

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని 17 స్థానాలకు మంగళవారం 128 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

Published : 24 Apr 2024 04:53 IST

ఈనాడు, హైదరాబాద్‌ -మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని 17 స్థానాలకు మంగళవారం 128 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నెల 18వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఐదు రోజుల్లో కలిపి 415 మంది అభ్యర్థులు బరిలో నిలిచేందుకు ఎన్నికల అధికారులకు పత్రాలను అందజేసి ప్రమాణం చేశారు. మంగళవారం ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్‌, భారాస నుంచి ఆరుగురు నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో కాంగ్రెస్‌ నుంచి ఎంపీ డా.గడ్డం రంజిత్‌రెడ్డి(చేవెళ్ల), భారాస నుంచి ప్రస్తుత లోక్‌సభ సభ్యురాలు మాలోత్‌ కవిత(మహబూబాబాద్‌), కంచర్ల కృష్ణారెడ్డి(నల్గొండ), ఆత్రం సక్కు(ఆదిలాబాద్‌) ఉన్నారు. కాంగ్రెస్‌ నేతలు మహ్మద్‌ వలీ ఉల్లా సమీర్‌ హైదరాబాద్‌ నుంచి దాఖలు చేయగా ఖమ్మంలో రామసహాయం రఘురామిరెడ్డి పక్షాన అనుచరులు నామినేషన్‌ పత్రాలు అందజేశారు. అత్యధికంగా చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి నియోజకవర్గాల నుంచి 12 మంది చొప్పున, సికింద్రాబాద్‌లో 11, హైదరాబాద్‌, నిజామాబాద్‌ నుంచి 10 చొప్పున, కరీంనగర్‌ 9, నల్గొండ, నాగర్‌కర్నూల్‌లో 8 చొప్పున, ఖమ్మం, వరంగల్‌ నుంచి ఏడుగురు వంతున, పెద్దపల్లి, మహబూబాబాద్‌, మహబూబ్‌నగర్‌లలో అయిదు చొప్పున, ఆదిలాబాద్‌ మూడు, మెదక్‌, జహీరాబాద్‌లలో ఇద్దరు అభ్యర్థుల చొప్పున నామినేషన్లు వేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img