icon icon icon
icon icon icon

మూడో దశ బరిలో 1,351 మంది

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మూడో దశలో పోలింగ్‌ జరగనున్న 95 స్థానాల్లో 1,351 మంది పోటీపడుతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

Published : 24 Apr 2024 04:53 IST

కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడి

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మూడో దశలో పోలింగ్‌ జరగనున్న 95 స్థానాల్లో 1,351 మంది పోటీపడుతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని ఈ 95 స్థానాల్లో మే ఏడో తేదీన పోలింగ్‌ జరగనుంది. 1,351 మందిలో మధ్యప్రదేశ్‌లోని బైతూల్‌ స్థానం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఎనిమిది మంది అభ్యర్థులూ ఉన్నారు. వాస్తవానికి ఈ స్థానానికి రెండో దశలోనే పోలింగ్‌ జరగాల్సి ఉంది. అయితే బీఎస్పీ అభ్యర్థి మరణంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆ స్థానంలో పోలింగ్‌ను మూడో దశకు మార్చింది. మూడో దశకు సంబంధించి 95 స్థానాలకు మొత్తం 2,963 నామినేషన్‌లు వచ్చాయని, వాటిలో 1,563 నామినేషన్లను ఆమోదించినట్లు ఈసీ తెలిపింది. ఈ నెల 22వ తేదీతోనే నామినేషన్ల ఉప సంహరణకు గడువు ముగిసినట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img