icon icon icon
icon icon icon

మహబూబాబాద్‌ భారాసలో భగ్గుమన్న విభేదాలు

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో భారాస అభ్యర్థి, ఎంపీ మాలోత్‌ కవిత నామినేషన్‌ సందర్భంగా మంగళవారం ఎంపీ క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో పార్టీ నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.

Published : 24 Apr 2024 04:54 IST

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో భారాస అభ్యర్థి, ఎంపీ మాలోత్‌ కవిత నామినేషన్‌ సందర్భంగా మంగళవారం ఎంపీ క్యాంపు కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో పార్టీ నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్‌ మాట్లాడుతూ ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో కొందరు పార్టీ శ్రేణులు కావాలని అటూఇటూ చేశారు. దయచేసి అలా చేయకండి. అందరం కలసికట్టుగా ఉందాం. అభ్యర్థిని గెలిపిద్దాం’’ అని పేర్కొన్నారు. శంకర్‌నాయక్‌ను ఉద్దేశించి ఎమ్మెల్సీ రవీందర్‌రావు మాట్లాడుతూ ‘ఏంటిదన్నా.. పరాచికమా?’ అని అన్నారు. మాలోత్‌ కవిత జోక్యం చేసుకొని శంకర్‌నాయక్‌ నుంచి మైక్‌ తీసుకుని.. సర్దిచెప్పేందుకు యత్నించారు. శంకర్‌నాయక్‌ తన ప్రసంగం కొనసాగిస్తూ.. ‘నేను జరిగిందే చెబుతున్నాను. కొట్టుకుందామంటే కొట్టుకుందాం. నేను రెడీ’ అనడంతో సమావేశంలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. వేదికపై ఉన్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర జోక్యంతో వివాదం సద్దుమణిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img