icon icon icon
icon icon icon

కేసీఆర్‌ మోకాళ్ల యాత్ర చేసినా భారాస గెలవదు

భారాస శకం ముగిసిందని, కేసీఆర్‌ బస్సుయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా నల్గొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

Published : 24 Apr 2024 04:54 IST

14 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం ఖాయం
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్‌టుడే: భారాస శకం ముగిసిందని, కేసీఆర్‌ బస్సుయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా నల్గొండ, భువనగిరి లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘రెండుసార్లు సీఎంగా పని చేసిన కేసీఆర్‌, మంత్రిగా ఉన్న జగదీశ్‌రెడ్డి అక్రమంగా రూ.వేల కోట్లు సంపాదించారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 14 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించడం ఖాయం. సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి మేమంతా సమష్టిగా పనిచేస్తున్నాం. కేసీఆర్‌కు దమ్ముంటే మెదక్‌ ఎంపీ సీటు గెలిపించుకోవాలి. నదీజలాల పంపకంలో ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్‌ లాలూచీ పడటం వల్లే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరవు వచ్చింది. ఇప్పుడేం ముఖం పెట్టుకొని మిర్యాలగూడకు వస్తారు. భారాస నేతల గురించి శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి బాగా చెప్పారు. ఎంపీ ఎన్నికలు పూర్తవ్వగానే అభివృద్ధి పనులపై మరింత దృష్టి సారిస్తాం’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img