icon icon icon
icon icon icon

స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌పై సీఈవోకు భాజపా ఫిర్యాదు

నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారంటూ శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌పై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) వికాస్‌రాజ్‌కు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, పార్టీ నాయకురాలు మాధవి మంగళవారం ఫిర్యాదు చేశారు.

Published : 24 Apr 2024 04:55 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారంటూ శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌పై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) వికాస్‌రాజ్‌కు భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, పార్టీ నాయకురాలు మాధవి మంగళవారం ఫిర్యాదు చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌.. కాంగ్రెస్‌ చేవెళ్ల అభ్యర్థి రంజిత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పాల్గొన్నారని తెలిపారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఈవోను కోరినట్లు వారు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img