icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులకు బీ-ఫాంలు

పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థులకు పార్టీ బీ-ఫాంలు అందించింది.

Published : 24 Apr 2024 04:56 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థులకు పార్టీ బీ-ఫాంలు అందించింది. మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌చౌధరి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌, సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ల చేతుల మీదుగా బీ-ఫాంలు పంపిణీ చేశారు. చామల కిరణ్‌కుమార్‌రెడ్డి(భువనగిరి), దానం నాగేందర్‌(సికింద్రాబాద్‌), నీలం మధు ముదిరాజ్‌(మెదక్‌)లు స్వయంగా వచ్చి బీ-ఫాంలు అందుకున్నారు. మిగతా అభ్యర్థుల తరఫున వారి ప్రతినిధులు వచ్చి తీసుకున్నారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి, సీనియర్‌ ఉపాధ్యక్షుడు టి.కుమార్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

పీసీసీ దివ్యాంగుల విభాగం ప్రచార కరపత్రం ఆవిష్కరించిన సీఎం

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పీసీసీ దివ్యాంగుల విభాగం ఆధ్వర్యంలో బుధవారం నుంచి చేపట్టనున్న ‘విజయసంకల్ప యాత్ర’ ప్రచార కరపత్రాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. పీసీసీ దివ్యాంగుల విభాగం ఛైర్మన్‌ ముత్తినేని వీరయ్యవర్మ సీఎంను ఆయన నివాసంలో మంగళవారం కలిసి యాత్ర తదితర విషయాలపై మాట్లాడారు. మధ్యాహ్నం 12 గంటలకు గాంధీభవన్‌లో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఎల్‌ఈడీ ప్రచార వాహనాలను జెండా ఊపి ప్రారంభిస్తారని వీరయ్యవర్మ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img