icon icon icon
icon icon icon

ఎన్నికలను బహిష్కరించిన ‘రాజారం’

‘ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారుతున్నా మా సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఎన్నికలప్పుడు వచ్చే నాయకులు.. తర్వాత మా వైపు కన్నెత్తి చూడటం లేదు.

Published : 24 Apr 2024 04:56 IST

ఏళ్ల తరబడి గ్రామ సమస్యలు తీర్చలేదంటూ ఆవేదన

కోటపల్లి, న్యూస్‌టుడే: ‘ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారుతున్నా మా సమస్యలు పరిష్కారం కావడం లేదు. ఎన్నికలప్పుడు వచ్చే నాయకులు.. తర్వాత మా వైపు కన్నెత్తి చూడటం లేదు. అందుకే ఈ లోక్‌సభ ఎన్నికలకు మేము దూరంగా ఉంటాం’ అని మంగళవారం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాజారం గ్రామస్థులు మూకుమ్మడిగా తీర్మానించారు. ఇప్పటికీ తమ గ్రామానికి సరైన రహదారి లేక అత్యవసర వైద్యానికి ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రైవేటు వాహనాలపై ఆధారపడుతున్నామన్నారు. ఇప్పటికైనా రాజారం నుంచి బబ్బెరుచెల్క వరకు, కావర్‌ కొత్తపల్లి నుంచి పార్‌పల్లి వరకు రహదారి మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img