icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌లో చేరికల కమిటీ ఏర్పాటు

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకుల చేరికలపై కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి సారించింది.  జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు పీసీసీ బుధవారం ప్రతేక్యంగా ఒక కమిటీ ఏర్పాటు చేసింది.

Published : 25 Apr 2024 02:51 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకుల చేరికలపై కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి సారించింది.  జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు పీసీసీ బుధవారం ప్రతేక్యంగా ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఇందులో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌, కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి ఉన్నారు. కాంగ్రెస్‌లోకి వచ్చే వారిపై ఈ కమిటీ ఆరా తీస్తుంది. వారితో పార్టీ బలపడుతుందని భావిస్తే చేర్చుకుంటుంది. ఈ నెల 25, 26 తేదీల్లో గాంధీభవన్‌లో వివిధ పార్టీల నుంచి చేరికలు ఉంటాయని పీసీసీ వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img