icon icon icon
icon icon icon

నెహ్రూపై జైశంకర్‌ వ్యాఖ్యలు ఖండిస్తున్నాం: కాంగ్రెస్‌

దేశ ప్రథమ ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ ఉదాసీనత వల్లే చైనా దురాక్రమణ జరిగిందని కేంద్ర మంత్రి జైశంకర్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ తెలిపారు.

Published : 25 Apr 2024 02:52 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: దేశ ప్రథమ ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ ఉదాసీనత వల్లే చైనా దురాక్రమణ జరిగిందని కేంద్ర మంత్రి జైశంకర్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ తెలిపారు. జైశంకర్‌ తక్షణం బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. నిరంజన్‌ బుధవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నెహ్రూను ప్రపంచం దార్శనికుడు, శాంతిదూత, నవభారత నిర్మాతగా గుర్తించిందన్నారు. చైనాతో స్నేహబంధం బలపర్చడానికి పంచశీల ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయాన్ని మరవకూడదన్నారు. భాజపా నేతలు ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నాయకులపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రధాని మోదీ పదేపదే ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తున్నా సీఈసీ చర్యలు తీసుకోవడం లేదని , దీనిపై బుధవారం మరోసారి సీఈసీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img