icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న

నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ను బరిలో దింపుతున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది.

Updated : 25 Apr 2024 06:30 IST

ఈనాడు, నల్గొండ: నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ను బరిలో దింపుతున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ పేరిట బుధవారం ప్రకటన విడుదల చేశారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి భారాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే ఈ స్థానానికి తుది ఓటరు జాబితాను వెలువరించగా..మొత్తం 4.61 లక్షల మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img