icon icon icon
icon icon icon

దివ్యాంగులకు హామీలు నెరవేరుస్తాం: మహేశ్‌గౌడ్‌

కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించడంతోపాటు మ్యానిఫెస్టోలో వారికిచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు.

Published : 25 Apr 2024 02:58 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించడంతోపాటు మ్యానిఫెస్టోలో వారికిచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. పీసీసీ దివ్యాంగుల విభాగం ఛైర్మన్‌, పెరిక కుల కార్పొరేషన్‌ సాధన సమితి ఛైర్మన్‌ వీరయ్యవర్మ చేపట్టిన విజయ సంకల్ప యాత్రను ఆయన బుధవారం గాంధీభవన్‌లో జెండా ఊపి ప్రారంభించారు. వీరయ్యవర్మ మాట్లాడుతూ.. మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తామని పేర్కొన్నారు. పీసీసీ మత్స్య విభాగం ఛైర్మన్‌ మెట్టు సాయికుమార్‌, పెరిక కుల కార్పొరేషన్‌ సాధన సమితి అసోసియేట్‌ అధ్యక్షుడు కోట మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు సాంబయ్య, ప్రధాన కార్యదర్శి స్వర్ణలత మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు లేఖ అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img