icon icon icon
icon icon icon

కొండా సురేఖపై ఫిర్యాదుపై 26లోగా ఉత్తర్వులు

భారాస ఎమ్మెల్యే కె.టి.రామారావు ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ మంత్రి కొండా సురేఖపై భారాస అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదుపై ఈనెల 26లోగా తగిన ఉత్తర్వులు వెలువరిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించింది.

Published : 25 Apr 2024 03:55 IST

హైకోర్టుకు నివేదించిన ఎన్నికల సంఘం

ఈనాడు, హైదరాబాద్‌: భారాస ఎమ్మెల్యే కె.టి.రామారావు ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ మంత్రి కొండా సురేఖపై భారాస అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదుపై ఈనెల 26లోగా తగిన ఉత్తర్వులు వెలువరిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించింది. వరంగల్‌లో కొండా సురేఖ..  కేటీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తాము ఫిర్యాదు ఇచ్చినా ఎన్నికల సంఘం చర్య తీసుకోలేదని సవాలు చేస్తూ దాసోజు సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది బి.మయూర్‌రెడ్డి వాదనలు వినిపించారు. సురేఖపై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఫిర్యాదును పరిశీలించి ఈనెల 26లోగా తగిన ఉత్తర్వులు వెలువరిస్తామని తెలిపారు. వాదనలను విన్న ధర్మాసనం.. ఫిర్యాదుపై తగిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం చెబుతున్న దృష్ట్యా ఎలాంటి ఉత్తర్వులు అవసరంలేదని పేర్కొంటూ పిటిషన్‌పై విచారణను మూసివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img