icon icon icon
icon icon icon

కడియం, వెంకట్రావులపై అనర్హత పిటిషన్‌లను స్పీకర్‌ స్వీకరించాలి

తమ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌లను స్పీకర్‌ స్వీకరించడం లేదని పేర్కొంటూ కుత్బుల్లాపూర్‌ భారాస శాసనసభ్యుడు వివేకానంద హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

Published : 25 Apr 2024 03:56 IST

హైకోర్టులో ఎమ్మెల్యే వివేకానంద పిటిషన్‌
నేడు విచారణ

ఈనాడు, హైదరాబాద్‌: తమ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌లను స్పీకర్‌ స్వీకరించడం లేదని పేర్కొంటూ కుత్బుల్లాపూర్‌ భారాస శాసనసభ్యుడు వివేకానంద హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈనెల 3న, 9న స్పీకర్‌ను కలిసి అనర్హత పిటిషన్‌ సమర్పించడానికి వెళ్లగా కనీసం కలవడానికి అనుమతించలేదన్నారు. ‘‘ఈనెల 10న రిజిస్టర్‌ పోస్టు, మెయిల్‌ ద్వారా పంపినా అందినట్లు ధ్రువీకరించడానికి స్పీకర్‌ కార్యాలయం నిరాకరించింది. వెంకట్రావు ఈ నెల 6న తుక్కుగూడలో ఏర్పాటు చేసిన రాహుల్‌గాంధీ బహిరంగ సభలో కాంగ్రెస్‌లో చేరారు. మార్చి 31న కడియం శ్రీహరి కాంగ్రెస్‌ కండువా ధరించారు. ఆయన కుమార్తె కావ్యను ఆ పార్టీ వరంగల్‌ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. స్పీకర్‌ దురుద్దేశంతో అనర్హత పిటిషన్‌లను స్వీకరించడానికి నిరాకరిస్తున్నారు. పార్టీ ఫిరాయించిన వారికి నోటీసులు జారీ చేసేలా స్పీకర్‌ను ఆదేశించండి’’ అని ఎమ్మెల్యే వివేకానంద న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి గురువారం విచారణ చేపట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img