icon icon icon
icon icon icon

కంటోన్మెంట్‌లో రెబల్‌గా సర్వే నామినేషన్‌

గెలుపు గుర్రాలకు కాకుండా కుంటి గుర్రాలకు సీఎం రేవంత్‌రెడ్డి టికెట్‌లు ఇస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ విమర్శించారు.

Published : 25 Apr 2024 03:57 IST

సీఎం రేవంత్‌రెడ్డి తీరుపై విమర్శలు

కార్ఖానా, న్యూస్‌టుడే: గెలుపు గుర్రాలకు కాకుండా కుంటి గుర్రాలకు సీఎం రేవంత్‌రెడ్డి టికెట్‌లు ఇస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ విమర్శించారు. కాంగ్రెస్‌ తిరుగుబాటు అభ్యర్థిగా కంటోన్మెంట్‌ నుంచి బుధవారం ఆయన నామినేషన్‌ వేశారు. అంతకు ముందు మహేంద్రాహిల్స్‌లోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో రెండుసార్లు ఎంపీగా గెలుపొంది కేంద్ర మంత్రిగా పనిచేసిన తాను ఎమ్మెల్యేగా పోటీకి పనికిరానా అని ప్రశ్నించారు. భాజపా నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయిన శ్రీ గణేశ్‌ను పార్టీలోకి ఆహ్వానించి టికెట్‌ ఇవ్వడం ఎంత వరకు సమంజసమన్నారు. మాదిగ జనాభా ఎక్కువగా ఉన్న కంటోన్మెంట్‌లో తనలాంటి మాదిగ బిడ్డకు అన్యాయం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కంటోన్మెంట్‌ అభ్యర్థి విషయంలో పునరాలోచన చేయాలని, తనకు బీ ఫాం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో అటు మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా, ఇటు కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండు చోట్ల కాంగ్రెస్‌ రెబల్‌గా బరిలో దిగి తన తడాఖా ఏమిటో చూపిస్తానన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img