icon icon icon
icon icon icon

ఆరో రోజు 188 మంది నామినేషన్లు

రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆరో  రోజైన బుధవారం 188 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

Published : 25 Apr 2024 04:00 IST

పత్రాల సమర్పణకు నేడే తుది గడువు
రేపు పరిశీలన.. అర్హుల జాబితా ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆరో  రోజైన బుధవారం 188 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈ నెల 18న స్వీకరణ ప్రారంభమైనప్పటి నుంచి మొత్తంగా 603 మంది నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎనిమిది మంది, భాజపా నుంచి నలుగురు, భారాస నుంచి ఒక అభ్యర్థి చొప్పున నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల తుది జాబితాను సాయంత్రం ప్రకటించగా అంతకుముందు కరీంనగర్‌, ఖమ్మం స్థానాల నుంచి పలువురు ఆశావహులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి తాటిపర్తి జీవన్‌రెడ్డి(నిజామాబాద్‌), కుందూరు రఘువీర్‌రెడ్డి(నల్గొండ), చామల కిరణ్‌కుమార్‌రెడ్డి(భువనగిరి), అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి(కరీంనగర్‌), పోట్ల నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు, నాగా సీతారాములు(ఖమ్మం), దానం నాగేందర్‌(సికింద్రాబాద్‌), భాజపా నుంచి గోడం నగేష్‌(ఆదిలాబాద్‌), గోమాసె శ్రీనివాస్‌(పెద్దపల్లి), అరూరి రమేష్‌(వరంగల్‌), కొంపెల్ల మాధవీలత(హైదరాబాద్‌), భారాస నుంచి నామా నాగేశ్వరరావు(ఖమ్మం) దాఖలు చేసిన వారిలో ఉన్నారు. కొందరు అభ్యర్థులు రెండు, మూడు సెట్ల నామినేషన్లు వేశారు. నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగియనుంది. అధికారులు శుక్రవారం పరిశీలన చేపట్టి అర్హమైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది.

అత్యధికంగా చేవెళ్లలో..: అత్యధికంగా మల్కాజిగిరి నియోజకవర్గంలో 38 మంది దాఖలు చేశారు. అతి తక్కువగా నాగర్‌కర్నూల్‌లో ఇద్దరు అభ్యర్థులు పత్రాలు సమర్పించారు. చేవెళ్లలో 17 మంది, వరంగల్‌, నల్గొండలో 16 చొప్పున, హైదరాబాద్‌లో 14, ఖమ్మంలో 13, భువనగిరి, సికింద్రాబాద్‌లో పది చొప్పున, కరీంనగర్‌, పెద్దపల్లి, మహబూబాబాద్‌లలో ఎనిమిది వంతున, జహీరాబాద్‌లో ఏడుగురు, మెదక్‌లో ఆరుగురు, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ అయిదుగురు అభ్యర్థుల చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img