icon icon icon
icon icon icon

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓపిక అవసరం

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓపిక, సహనం ఉండాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గమనించి మాట్లాడాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ స్పష్టం చేశారు.

Published : 25 Apr 2024 04:38 IST

వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ

న్యూస్‌టుడే, సంగారెడ్డి అర్బన్‌: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓపిక, సహనం ఉండాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గమనించి మాట్లాడాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ స్పష్టం చేశారు. జహీరాబాద్‌ ఎంపీ అభ్యర్థి సురేశ్‌ షెట్కార్‌ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం సంగారెడ్డికి వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే సవాల్‌ చేయడంపై మంత్రి స్పందిస్తూ.. పదేళ్లుగా ఆయన సవాళ్లు విసురుతూనే ఉన్నారని, భారాస నేతలకు జీవితాంతం అబద్ధాలు మాట్లాడటం తప్ప మరో మార్గం లేదన్నారు. కుటుంబ పాలనతో ప్రజల స్వేచ్ఛను హరించారని ఆరోపించారు. భారాసకు ప్రజలు చరమగీతం పాడారన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ మాట్లాడుతూ... 90 రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేసిన ఘనత తమదేనని చెప్పారు. జహీరాబాద్‌ భాజపా ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌ పదేళ్లుగా నియోజకవర్గానికి ఏం చేశారని ప్రశ్నించారు. సమావేశంలో నారాయణఖేడ్‌ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, మాజీ మంత్రి చంద్రశేఖర్‌, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img