icon icon icon
icon icon icon

రాష్ట్రానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు

రాష్ట్రంలో భాజపా ప్రచారంలో సినీతారలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేతలు పాలుపంచుకోనున్నారు.

Published : 26 Apr 2024 03:29 IST

భాజపా తరఫున ప్రచారానికి రాక

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో భాజపా ప్రచారంలో సినీతారలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేతలు పాలుపంచుకోనున్నారు. భాజపా ప్రకటించిన పలువురు స్టార్‌ క్యాంపెయినర్లు రాష్ట్రంలో భాజపా అభ్యర్థుల తరఫున ప్రచార కార్యక్రమాలకు హాజరవనున్నారు. స్టార్‌ క్యాంపెయినర్లుగా.. సినీ నటులు కుష్బూ, రాధిక, సాయికుమార్‌, జీవితలు భాజపా అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొననున్నారు. రాజకీయ ప్రముఖులు..కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలా సీతారామన్‌, నితీన్‌ గడ్కరీలతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌లతో పాటు కర్ణాటక భాజపా ఎంపీ తేజస్వీ సూర్య, తెలంగాణ మాజీ గవర్నర్‌, తమిళనాడు భాజపా అభ్యర్థి తమిళిసై, తమిళనాడు భాజపా అధ్యక్షుడు కె.అన్నామలై సహా ఇతర నేతలు ప్రచారంలో పాల్గొననున్నారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 29న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి రానున్నారు. ఉదయం 10 గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం 12 గంటలకు మహబూబాబాద్‌ జనసభల్లో, సాయంత్రం మల్కాజిగిరి పార్లమెంట్‌ పరిధిలోని కుత్బుల్లాపూర్‌ రోడ్‌షోల్లో పాల్గొంటారని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img