icon icon icon
icon icon icon

ప్రధాని మోదీపై చర్యలు తీసుకోవాలి

ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని, ఆయనపై ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు.

Published : 26 Apr 2024 04:52 IST

సీఈఓ వికాస్‌రాజ్‌కు కాంగ్రెస్‌ నేతల వినతి

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని, ఆయనపై ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. పీసీసీ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, నాయకులు రామచంద్రారెడ్డి, నర్సారెడ్డి భూపతిరెడ్డిలు గురువారం సీఈఓ వికాస్‌రాజ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మహిళల తాళిబొట్లు తెంచుతారని మోదీ మాట్లాడటమేంటని శోభారాణి ఆక్షేపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img