icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ ఏర్పాటు

కాంగ్రెస్‌ రాష్ట్ర ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీని ఏడుగురు సభ్యులతో ఏర్పాటు చేసినట్లు పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated : 26 Apr 2024 05:26 IST

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ రాష్ట్ర ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీని ఏడుగురు సభ్యులతో ఏర్పాటు చేసినట్లు పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, మాజీ ఎమ్మెల్సీలు కపిలవాయి దిలీప్‌కుమార్‌, రాములు నాయక్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్‌రెడ్డి, ప్రచార కమిటీ సంయుక్త కన్వీనర్‌ దివ్యవాణి, పీసీసీ అధికార ప్రతినిధి కత్తి వెంకటస్వామి కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కార్యక్రమాలను ఈ కమిటీ నిర్వహిస్తుందని ఆయన వివరించారు.

సీఎంను సవాల్‌ చేసే స్థాయి హరీశ్‌రావుకు లేదు

‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సవాల్‌ చేసే స్థాయి మాజీమంత్రి హరీశ్‌రావుకు లేదు, మీ స్థాయికి నేను సరిపోతా’ అని పరిగి ఎమ్మెల్యే టి.రాంమోహన్‌రెడ్డి అన్నారు. ఆయన గురువారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే కొన్ని అమలు చేశామని, ఎన్నికల తర్వాత మిగతావి అమలు చేస్తామన్నారు. ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా ఉండేందుకే కేసీఆర్‌ కాంగ్రెస్‌పై అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆగస్టు 15న రాజీనామాకు సిద్ధంగా ఉండాలని హరీశ్‌రావుకు రాంమోహన్‌రెడ్డి సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img