icon icon icon
icon icon icon

నేత కార్మికుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే: కేటీఆర్‌

రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన నేతన్నల ఆత్మహత్యలను ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు.

Published : 26 Apr 2024 04:54 IST

సిరిసిల్ల గ్రామీణం, న్యూస్‌టుడే: రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన నేతన్నల ఆత్మహత్యలను ప్రభుత్వ హత్యలుగా భావిస్తున్నామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారడం బాధాకరమని పేర్కొన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన అడిచర్ల సాయి, ఆంకారపు మల్లేశం కుటుంబాలను గురువారం భారాస కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బి.వినోద్‌కుమార్‌తో కలిసి ఆయన పరామర్శించారు. తక్షణ సహాయం కింద ఆ కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. ప్రభుత్వం 24 గంటల్లో స్పందించి నేతన్నలకు చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక నాలుగు నెలల్లో నలుగురు నేత కార్మికులు ఉపాధి లేక చనిపోయారని తెలిపారు. స్థానిక నాయకులు నేత కార్మికులపై వ్యంగ్యంగా మాట్లాడి వారి మనోభావాలను దెబ్బతీస్తూ ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని బి.వినోద్‌కుమార్‌ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img