icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌లో చేరిన వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి

వరంగల్‌ మేయర్‌ (భారాస), మాజీ ఎంపీ గుండు సుధారాణి, ఆప్కో మాజీ ఛైర్మన్‌, జనగామ జిల్లా భారాస నేత మండల శ్రీరాములు, నల్గొండ డీసీసీబీ డైరెక్టర్‌ అందెల లింగంయాదవ్‌, ఓయూ జేఏసీ నేత కోటూరి మానవతారాయ్‌లు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

Published : 26 Apr 2024 04:55 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ మేయర్‌ (భారాస), మాజీ ఎంపీ గుండు సుధారాణి, ఆప్కో మాజీ ఛైర్మన్‌, జనగామ జిల్లా భారాస నేత మండల శ్రీరాములు, నల్గొండ డీసీసీబీ డైరెక్టర్‌ అందెల లింగంయాదవ్‌, ఓయూ జేఏసీ నేత కోటూరి మానవతారాయ్‌లు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గురువారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ చేరికల కమిటీ సభ్యులు జగ్గారెడ్డి, కోదండరెడ్డిలు వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ‘కాంగ్రెస్‌ సిద్ధాంతాలు, భావజాలం పట్ల ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నాం’ అని ఈ సందర్భంగా వారి నుంచి డిక్లరేషన్‌ పత్రాలు తీసుకున్నారు. గుండు సుధారాణి గతంలో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే.

మోదీ మళ్లీ ప్రధాని అయితే రిజర్వేషన్లు ఎత్తేస్తారు: జగ్గారెడ్డి

నరేంద్రమోదీ మళ్లీ ప్రధానమంత్రి అయితే రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు ఎత్తేస్తారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ఆరోపించారు. రాహుల్‌గాంధీ ప్రధాని అయితే దేశవ్యాప్తంగా కుల గణన చేసి రిజర్వేషన్లు పెంచుతారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img