icon icon icon
icon icon icon

దేశాన్ని గాడినపెట్టే సత్తా కాంగ్రెస్‌కే

భారతదేశాన్ని గాడినపెట్టే సత్తా కాంగ్రెస్‌ పార్టీకే ఉందని.. దేశ ప్రజలంతా లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి వైపు చూస్తున్నారని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

Published : 26 Apr 2024 04:55 IST

మంత్రులు తుమ్మల, పొంగులేటి
ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి నామినేషన్‌

ఈటీవీ, ఖమ్మం: భారతదేశాన్ని గాడినపెట్టే సత్తా కాంగ్రెస్‌ పార్టీకే ఉందని.. దేశ ప్రజలంతా లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి వైపు చూస్తున్నారని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆశీస్సులతో ఎన్నికల బరిలో దిగుతున్న రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామన్నారు. కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాలు గెలిపించి కాంగ్రెస్‌ పార్టీకి కానుకగా ఇస్తామన్నారు. రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి మాట్లాడుతూ... మోదీ పదేళ్ల పాలనలో పేదరికం, నిరుద్యోగం విపరీతంగా పెరిగాయని విమర్శించారు. ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. తెలంగాణలో భాజపా ఎదగకుండా ఉండేందుకే కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నాయని తెలిపారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌, ఎమ్మెల్యే మాలోత్‌ రాందాస్‌నాయక్‌ పాల్గొన్నారు. అంతకుముందు రఘురాంరెడ్డి నామినేషన్‌ సందర్భంగా ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img