icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌ సమావేశంలో భారాస ఎమ్మెల్సీ సారయ్య

ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన భారాస ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గురువారం ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్‌ ముఖ్య నాయకుల అంతర్గత సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది.

Published : 26 Apr 2024 08:53 IST

రంగంపేట, న్యూస్‌టుడే: ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన భారాస ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య గురువారం ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్‌ ముఖ్య నాయకుల అంతర్గత సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌, డోర్నకల్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రామచంద్రునాయక్‌, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మురళీనాయక్‌, కాంగ్రెస్‌ నాయకుడు నెహ్రూనాయక్‌లతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు సమావేశమయ్యారు. ఖమ్మం కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థి రఘురాంరెడ్డి ఎన్నికల వ్యూహానికి సంబంధించిన అంశాలను చర్చించారు. దీంతో సారయ్య కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై సారయ్యను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. ‘సురేందర్‌రెడ్డి నాకు గురువు లాంటి వారు. ఆయన కుమారుడికి ఎంపీ టికెట్‌ రావడంతో అభినందించేందుకు వెళ్లాను. కాంగ్రెస్‌లో చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img