icon icon icon
icon icon icon

సీఎంను కలసిన ఎంపీ, ఎమ్మెల్సీ అభ్యర్థులు

ఖమ్మం, కరీంనగర్‌ పార్లమెంటు స్థానాల కాంగ్రెస్‌ అభ్యర్థులు రఘురాంరెడ్డి, వెలిచాల రాజేందర్‌రావు, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ స్థానం అభ్యర్థిగా పార్టీ ప్రకటించిన తీన్మార్‌ మల్లన్న గురువారం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు.

Updated : 26 Apr 2024 05:20 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఖమ్మం, కరీంనగర్‌ పార్లమెంటు స్థానాల కాంగ్రెస్‌ అభ్యర్థులు రఘురాంరెడ్డి, వెలిచాల రాజేందర్‌రావు, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ స్థానం అభ్యర్థిగా పార్టీ ప్రకటించిన తీన్మార్‌ మల్లన్న గురువారం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. సమయం తక్కువగా ఉన్నందున విస్తృతంగా ప్రచారం చేసి విజయం సాధించాలని సీఎం వారికి సూచించారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న గ్యారంటీ హామీలను, పార్టీ జాతీయ మ్యానిఫెస్టోను వివరించాలని మార్గదర్శనం చేశారు. రఘురాంరెడ్డి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ సురేందర్‌రెడ్డి, పొంగులేటి సోదరుడు ప్రసాద్‌రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్‌రావుకు సీఎం బీఫాం అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img