icon icon icon
icon icon icon

17 స్థానాలు.. 895 నామినేషన్లు

రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం 348 మంది నామినేషన్లు వేశారు.

Published : 26 Apr 2024 04:59 IST

చివరి రోజు 348 మంది దాఖలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో నామినేషన్ల దాఖలు ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం 348 మంది నామినేషన్లు వేశారు. ఈ నెల 18న స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవగా మొత్తంగా 895 దాఖలు చేశారు. కాంగ్రెస్‌, భాజపా, భారాస అభ్యర్థులు భారీ ర్యాలీలతో కోలాహలంగా దాఖలు చేశారు. తొలి పర్వం ముగియటంతో ఇక ఎన్నికల ప్రచారం ముమ్మరం కానుంది. శుక్రవారం పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఉపసంహరణకు సోమవారం చివరి రోజు. అదే రోజు సాయంత్రంలోగా ఎన్నికల బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థులు, అన్‌రిజిస్టర్డ్‌ రాజకీయ పార్టీలకు గుర్తులు కేటాయిస్తారు. ఈ నెల 15వ తేదీ వరకు ఓటర్లుగా నమోదు చేసుకున్న దరఖాస్తుల్లో అర్హులకు ఈ నెల 29న తుది ఓటర్ల జాబితాను రూపొందించి అభ్యర్థులకు అందజేస్తారు.

టోకెన్లు ఇచ్చి..

నామినేషన్ల దాఖలుకు గురువారం చివరి రోజు కావటంతో పలు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ఎన్నికల అధికారుల కార్యాలయాలకు వచ్చారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి కార్యాలయానికి చేరుకున్న వారికి టోకెన్లు ఇచ్చి ఆ వరుస క్రమంలో స్వీకరించారు. ప్రతిపాదించిన ఓటర్ల వివరాలను పరిశీలించిన తరవాత అభ్యర్థులతో ప్రమాణం చేయించాల్సి ఉండటంతో రాత్రి పొద్దుపోయేంత వరకు ప్రక్రియ కొనసాగింది. మొత్తంగా 895 నామినేషన్లు దాఖలయ్యాయి.

మల్కాజిగిరిలో అత్యధికం

నియోజకవర్గాల వారీగా చివరిరోజు, మొత్తంగా వేసిన నామినేషన్లు వేసిన అభ్యర్థుల వివరాలివి. మల్కాజిగిరిలో 63(మొత్తం 114)మంది, హైదరాబాద్‌ 35(57), చేవెళ్ల 30(66), వరంగల్‌ 24(58), సికింద్రాబాద్‌ 23(57), మెదక్‌ 22(54), ఖమ్మం 22(45), పెద్దపల్లి 22(63), జహీరాబాద్‌ 19(40), నాగర్‌కర్నూల్‌ 19(34), కరీంనగర్‌ 16(53), భువనగిరి 16(61), నల్గొండ 11(56), నిజామాబాద్‌ 9(42), మహబూబ్‌నగర్‌ 8(42), మహబూబాబాద్‌ 7(30), ఆదిలాబాద్‌ 2(23) మంది అభ్యర్థుల దాఖలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img