icon icon icon
icon icon icon

మంత్రి జూపల్లిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం

డబ్బులు ఇచ్చినా ఆ మేరకు ఓట్లు రాలేదని అసహనం వ్యక్తం చేసిన మంత్రి జూపల్లి శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని కోరుతూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు భారాస నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

Updated : 27 Apr 2024 06:22 IST

భారాస నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

కోడేరు, న్యూస్‌టుడే: డబ్బులు ఇచ్చినా ఆ మేరకు ఓట్లు రాలేదని అసహనం వ్యక్తం చేసిన మంత్రి జూపల్లి శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని కోరుతూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు భారాస నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరులో ఎన్నికల సన్నాహక సమావేశం అనంతరం విలేకర్లతో ఆయన మాట్లాడారు. ‘మంత్రి జూపల్లి అసెంబ్లీ ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టి, దౌర్జన్యం చేసి గెలిచారు. పెంట్లవెల్లి మండలంలో డబ్బులు ఖర్చు పెట్టినా.. తక్కువ ఓట్లు వచ్చాయని స్వయంగా ఆయనే చెప్పారు. దీనిపై ఎన్నికల సంఘానికి, జిల్లా రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేస్తాం. మంత్రి నియోజకవర్గ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండలంలో ఓ భారాస నాయకుడిపై హత్యాయత్నం చేసినా.. ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయలేదు. నన్ను ఎంపీగా గెలిపిస్తే దిల్లీలో ప్రజా గొంతుకనవుతా’ అని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img