icon icon icon
icon icon icon

ఐఎన్‌సీ అంటే.. ఇటలీ నేషనల్‌ కాంగ్రెస్‌

ఐఎన్‌సీ అంటే ఇటలీ నేషనల్‌ కాంగ్రెస్‌ అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ విమర్శించారు.

Published : 27 Apr 2024 03:46 IST

దళిత సమ్మేళనంలో బండి సంజయ్‌ విమర్శ

మానకొండూర్‌, న్యూస్‌టుడే: ఐఎన్‌సీ అంటే ఇటలీ నేషనల్‌ కాంగ్రెస్‌ అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ విమర్శించారు. శుక్రవారం కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌లో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన దళిత సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ‘కాంగ్రెస్‌ పార్టీ భారత్‌ది కాదు. ఏఓ హ్యూమ్‌ అనే బ్రిటిష్‌ అధికారి దానిని స్థాపించారు. దళితుల అభ్యున్నతికి మోదీ ప్రభుత్వం నిరంతరం పాటుపడుతోంది. కేంద్రంలో పొరపాటున కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 50 శాతం ప్రజల ఆస్తులు గుంజుకోవడం ఖాయం. తెలంగాణ వస్తే దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చి మోసం చేశారు. అంబేడ్కర్‌ను అవమానించిన కాంగ్రెస్‌, భారాసలకు బుద్ధి చెప్పాలి’ అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు భాజపాలో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్‌, రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img