icon icon icon
icon icon icon

భారాస నేతల్ని భాజపాలోకి పంపుతున్న కేసీఆర్‌

‘భారాస వారు ఎలాగూ గెలవలేరు. అందుకే కాంగ్రెస్‌ పార్టీని ఓడిద్దామనే కుట్రతో ఆ పార్టీ నాయకులను కేసీఆర్‌ భాజపాలోకి  పంపుతున్నారు’ అని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.

Published : 27 Apr 2024 04:45 IST

కవిత విడుదలకు మార్గం సుగమం చేసుకుంటున్నారు
‘ఫోన్‌ ట్యాపింగ్‌’లో కేసీఆర్‌, కేటీఆర్‌ జైలుకెళ్లడం ఖాయం
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు

సిద్దిపేట టౌన్‌, న్యూస్‌టుడే: ‘భారాస వారు ఎలాగూ గెలవలేరు. అందుకే కాంగ్రెస్‌ పార్టీని ఓడిద్దామనే కుట్రతో ఆ పార్టీ నాయకులను కేసీఆర్‌ భాజపాలోకి  పంపుతున్నారు’ అని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. తద్వారా ఆయన తన కుమార్తె కవిత విడుదలకు మార్గం సుగమం చేసుకుంటున్నారని అన్నారు. సిద్దిపేటలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్యర్యంలో శుక్రవారం సాయంత్రం మెదక్‌ లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్‌తో కలసి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో, అనంతరం పార్టీ కార్యాలయంలో మంత్రి సురేఖ మాట్లాడారు. ‘‘ఇప్పటికే లిక్కర్‌ కేసులో కవిత జైల్లో ఉన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో త్వరలో కేటీఆర్‌, కేసీఆర్‌ జైలుకు వెళ్లడం ఖాయం. ఇక్కడి భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌గా ఉన్న సమయంలో రైతుల ఉసురు పోసుకున్నారు. ఎలాంటి మచ్చ లేని నీలం మధును గెలిపించుకోండి’’ అని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img