icon icon icon
icon icon icon

పీసీసీ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ తొలి భేటీ

ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటైన పీసీసీ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ తొలి భేటీ శుక్రవారం కమిటీ కన్వీనర్‌ మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్‌ అధ్యక్షతన గాంధీభవన్‌లో జరిగింది.

Updated : 27 Apr 2024 06:32 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటైన పీసీసీ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ తొలి భేటీ శుక్రవారం కమిటీ కన్వీనర్‌ మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్‌ అధ్యక్షతన గాంధీభవన్‌లో జరిగింది. సభ్యులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, మాజీ మంత్రి పుష్పలీల, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, పీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్‌రెడ్డి, ప్రచార కమిటీ జాయింట్‌ కన్వీనర్‌ దివ్యవాణి చౌదరి, ఓబీసీ డిపార్ట్‌మెంట్‌ కోఆర్డినేటర్‌ కత్తి వెంకటస్వామిలు హాజరయ్యారు. కమిటీ విధివిధానాలపై చర్చించారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై సలహాలు సూచనలు తెలిపారు.

పార్లమెంట్‌ నియోజకవర్గాల బాధ్యతలు తీసుకున్న సభ్యులు..

కపిలవాయి దిలీప్‌కుమార్‌- ఖమ్మం, నల్గొండ, భువనగిరి పార్లమెంట్‌ పరిధిలోని నకిరేకల్‌, తుంగతుర్తి, మునుగోడు, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్లు బల్మూరి వెంకట్‌- కరీంనగర్‌, పెద్దపల్లి.. పుష్పలీల- సికింద్రాబాద్‌, చేవెళ్ల..రాములు నాయక్‌- ఆదిలాబాద్‌, జహీరాబాద్‌, మెదక్‌..వినోద్‌రెడ్డి- హైదరాబాద్‌, నిజామాబాద్‌, మల్కాజిగిరి..దివ్యవాణి చౌదరి- నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌..కత్తి వెంకటస్వామి- మహబూబాబాద్‌, వరంగల్‌, భువనగిరి పార్లమెంట్‌ పరిధిలోని జనగామ, ఆలేరు, భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్‌లు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img