icon icon icon
icon icon icon

కిషన్‌రెడ్డి స్క్రిప్ట్‌ లీడర్‌: జగ్గారెడ్డి

కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్క్రిప్ట్‌ లీడర్‌, ఆ పార్టీ కార్యాలయంలో ప్రచారక్‌ ఏది రాసిస్తే అదే మాట్లాడతారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు.

Published : 28 Apr 2024 04:14 IST

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్క్రిప్ట్‌ లీడర్‌, ఆ పార్టీ కార్యాలయంలో ప్రచారక్‌ ఏది రాసిస్తే అదే మాట్లాడతారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. పీసీసీ మీడియా కమిటీ ఛైర్మన్‌ సామ రాంమోహన్‌రెడ్డి, అధికార ప్రతినిధి లింగం యాదవ్‌లతో కలిసి ఆయన శనివారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మన దేశ అబ్బాయి విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే..ఆమె భారత మహిళే అవుతుందని, దీనిపై అవగాహన లేని కిషన్‌రెడ్డి సోనియా గాంధీపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. భాజపా నేతలకు పదవులు ఆడ్వాణీ భిక్షేనన్నారు. కానీ మోదీ ఏనాడూ ఆయన్ను గౌరవించలేదన్నారు. భారాస పాలనలో ప్రతిపక్షానికి స్వేచ్ఛ ఇవ్వలేదని, తమ ప్రభుత్వం స్వేచ్ఛ ఇచ్చినందుకే కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. అలాగే పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీ ప్రధాన మంత్రి కాబోతున్నారని, అందుకే సోనియా గాంధీపై పలు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img