icon icon icon
icon icon icon

పోలింగ్‌ సమయం సాయంత్రం 6 గంటల వరకు పొడిగించాలి

వేసవి తీవ్రత దృష్ట్యా లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సమయాన్ని పొడిగించాలని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ వికాస్‌రాజ్‌కు లేఖ రాశారు.

Published : 28 Apr 2024 04:15 IST

పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: వేసవి తీవ్రత దృష్ట్యా లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ సమయాన్ని పొడిగించాలని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ వికాస్‌రాజ్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో 17 పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని సెగ్మెంట్లలో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బదులుగా సాయంత్రం 6 గంటల వరకు పెంచాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఎండలు, వడగాలుల కారణంగా ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారని, సమయం పొడిగించకపోతే పోలింగ్‌ శాతం తగ్గే అవకాశం ఉందన్నారు. అదే విధంగా పలు పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో శాంతిభద్రతల దృష్ట్యా ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించాలని ఈసీ నిర్ణయించిందని, ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు లేవని, కాబట్టి అక్కడ కూడా సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించాలని నిరంజన్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img