icon icon icon
icon icon icon

14 ఎంపీ సీట్లు రాకుంటే సీఎం రాజీనామా చేస్తారా?

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 14 సీట్లు రాకుంటే సీఎం పదవికి రాజీనామా చేయడానికి రేవంత్‌రెడ్డి సిద్ధమేనా? అని భాజపా శాసనసభాపక్ష నేత ఎ.మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు.

Published : 28 Apr 2024 04:16 IST

భాజపా శాసనసభాపక్ష నేత మహేశ్వర్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 14 సీట్లు రాకుంటే సీఎం పదవికి రాజీనామా చేయడానికి రేవంత్‌రెడ్డి సిద్ధమేనా? అని భాజపా శాసనసభాపక్ష నేత ఎ.మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికలు వంద రోజుల కాంగ్రెస్‌ పాలనకు రిఫరెండం అని అంటున్న సీఎం ఈ సవాల్‌ను స్వీకరించాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన సీట్ల ప్రాతిపదికన లోక్‌సభ ఎన్నికల్లో 14 ఎంపీ సీట్లు రావాలన్నారు. శనివారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ, ఇతర నేతలతో కలసి ఆయన మాట్లాడారు. ఆగస్టు 15న రుణమాఫీ ఒక్కటే కాదని.. అన్ని హామీలూ అమలుచేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకొంటాననే లేఖ, స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా పంపిస్తానన్నారు. హామీలు అమలు చేయలేకుంటే సీఎం పదవి నుంచి తప్పుకొంటారా? అని ప్రశ్నించారు. రుణ ‘రుణమాఫీతో పాటు మిగతా హామీలకు కూడా ఆగస్టు 15 గడువు పెడుతున్నారా’ అనే అంశాన్ని పక్కదారి పట్టించేలా మాజీ మంత్రి హరీశ్‌రావు, సీఎం రేవంత్‌రెడ్డి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నారని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లతో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img