icon icon icon
icon icon icon

వికసిత భారత్‌.. విభజిత భారత్‌ మధ్యే పోటీ

వికసిత భారత్‌.. విభజిత భారత్‌ మధ్యే ఈసారి లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు.

Published : 28 Apr 2024 04:16 IST

భాజపా ఎంపీ లక్ష్మణ్‌

ఈనాడు, హైదరాబాద్‌: వికసిత భారత్‌.. విభజిత భారత్‌ మధ్యే ఈసారి లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. వికసిత భారత్‌ లక్ష్యంతో భాజపా ముందుకు వెళ్తుంటే కాంగ్రెస్‌ విభజన రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో అధికార ప్రతినిధులు ప్రకాశ్‌రెడ్డి, ఎన్‌.వి.సుభాష్‌, పి.కిశోర్‌రెడ్డిలతో కలసి విలేకరులతో మాట్లాడారు. రిజర్వేషన్ల తొలగింపు అనే అంశం భాజపా ఎజెండాలోనే లేదన్నారు. రిజర్వేషన్లకు సంబంధించి మండల్‌ కమిషన్‌ సిఫార్సులను గతంలో రాజీవ్‌గాంధీ వ్యతిరేకించిన విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. రిజర్వేషన్లను రద్దు చేసేది లేదని స్పష్టం చేశారు. కానీ మతం పేరుతో ముస్లింలకు ఇచ్చిన 4%  రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తామన్నారు. సమగ్ర అధ్యయనం తర్వాతే దేశంలో కులగణన చేపట్టాలన్నారు. సనాతన ధర్మం నాశనం కావాలని కాంగ్రెస్‌ కోరుకుంటోందన్నారు. రామమందిరాన్ని నిర్మించింది ప్రభుత్వం కాదని.. ప్రజలే నిర్మించుకున్నారని గుర్తుచేశారు. మోదీ పాలనను జీర్ణించుకోలేక కాంగ్రెస్‌ అసత్య ప్రచారాలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఫోన్‌ ట్యాపింగ్‌ను కేవలం అధికారులకే పరిమితం చేశారని, సమగ్ర విచారణ ఎందుకు చేపట్టలేకపోతున్నారని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img