icon icon icon
icon icon icon

మే 1న పాతబస్తీలో అమిత్‌షా రోడ్‌ షో

భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మే ఒకటో తేదీన హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 28 Apr 2024 04:16 IST

రేపు భాజపా అధ్యక్షుడు నడ్డా రాక..
మూడు నియోజకవర్గాల్లో ప్రచారం

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా మే ఒకటో తేదీన హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు చార్మినార్‌ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని గౌలిపురలో అమిత్‌షా రోడ్‌ షోలో పాల్గొంటారని పేర్కొన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా  ఈ నెల 29న ఉదయం 11 గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం 12.30 గంటలకు మహబూబాబాద్‌ బహిరంగసభల్లో పాల్గొంటారని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నిజాంపేటలో రోడ్‌ షోలో పాల్గొంటారని, అదే రోజు రాత్రి పార్టీ ముఖ్యనేతలతో సమావేశమవుతారని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img